Header Banner

జూన్ 1 నుండి కొత్త విమాన సేవలు! ఇక విజయవాడ నుండి అక్కడికి ఒక గంటే..

  Wed May 07, 2025 10:30        Travel

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం విజయవాడ నుంచి విశాఖపట్టణం వెళ్లి, తిరిగి విజయవాడకు చేరుకునే ఈ సర్వీసును ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో నడపనున్నారు. ఈ విమాన సేవలు సాధారణ ప్రయాణికులతోపాటు వ్యాపార వర్గాల వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు హర్షం వ్యక్తం చేశారు.

 

విశాఖపట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో విజయవాడ, విశాఖ మధ్య రాకపోకలు ఎక్కువగా సాగుతాయి. కానీ, దూరం ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు మార్గంలో వెళ్లాలంటే చాలా సమయం పడుతోంది. విశాఖ నుంచి నేరుగా విమాన సేవలు అందుబాటులో లేకపోవటంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి విశాఖపట్టణానికి నూతన విమాన సేవలు అందించేందుకు కేంద్రం పౌర విమానయాన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ నుంచి విశాఖకు వెళ్లాలంటే.. చెన్నై నుంచి వచ్చే ఒకే విమానం అందుబాటులో ఉంది. కానీ, అందులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది హైదరాబాద్‌కు వెళ్లి, అక్కడి నుంచి విశాఖకు చేరుకుంటున్నారు. ఇక నుంచి నేరుగా విశాఖపట్టణానికి వెళ్లేలా విమాన సర్వీసు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! చెన్నై- విజయవాడ వందే భారత్ ఆ జిల్లా వరకు పొడిగింపు!

 

జూన్ 1వ తేదీ నుంచి విజయవాడ నుంచి విశాఖకు నూతన విమాన సర్వీసును ప్రారంభించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు సోమవారం నాడు ప్రకటించారు. ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఈ విమానం ఉదయం 7గంటల 15 నిమిషాలకు విజయవాడలో బయలుదేరి, 8 గంటల 25 నిమిషాలకు విశాఖపట్టణం చేరుకుంటుందని తెలిపారు. తిరిగి ఉదయం 8 గంట 45 నిమిషాలు విశాఖపట్టణ నుంచి బయలుదేరి 9 గంటల 45 నిమిషాలకు విజయవాడకు చేరుకుంటుంది.


ఈ నూతన విమాన సర్వీసుతో విజయవాడ నుంచి విశాఖకు వెళ్లే ప్రయాణికులకు సులభతరమైంది. ఇంతకు ముందు చెన్నై నుంచి విశాఖకు వెళ్లే విమాన సర్వీసు మాత్రమే అంటుబాటులో ఉండేది. అది, చెన్నై నుంచి ఉదయం 8 గంటల 5 నిమిషాలకు విజయవాడకు వచ్చి, 8 గంటల 45 నిమిషాలకు విశాఖకు బయలుదేరేది. కానీ, చెన్నై నుంచి విమానంలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది హైదరాబాద్‌ మీదుగా విశాఖకు చేరుకునేవారు. ఇప్పుడు ఈ ఇబ్బందులు తొలగనున్నాయి. విజయవాడ నుంచి ఉదయం విశాఖకు వెళ్లి పనులు చూసుకొని రాత్రికి అందుబాటులో ఉండే విమానాల్లో తిరిగి విజయవాడకు చేరుకోవచ్చని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


విజయవాడ నుంచి విశాఖకు ఉదయం వేళల్లో విమాన సర్వీసును పునరుద్ధరిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి ఇండిగో సేవలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్న పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ ప్రయాణికులతో పాటు వ్యాపార వర్గాల వారికి ఉపయోగకరంగా ఉండే ఈ సర్వీసు మాదిరిగానే మరిన్ని విమాన సర్వీసులు పెడతారని ఆశిస్తున్నట్టు గంటా శ్రీనివాస రావు ట్వీట్ చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VijayawadaToVizag #VizagFlights #IndiGoAirlines #NewFlightRoute #APConnectivity